కలం, వెబ్ డెస్క్: కేరళ (Kerala UDF) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు వెలువడుతున్న ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ స్థానాల్లో యూడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉండగా, అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) రెండో స్థానానికి పరిమితమై గట్టి పోటీనిస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని NDA కూటమి కూడా తమ ఉనికిని చాటుకుంటూ రెండు కీలక స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమైన ఈ ట్రెండ్స్, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా మారుతున్నాయని సూచిస్తున్నాయి.
Read Also: రేవంత్ రెడ్డిది తుగ్లక్ పాలన: కేటీఆర్
Follow Us On: Sharechat

