కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రధాన పార్టీల ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. డీఎంకే, టీవీకే పార్టీలు నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) రోడ్ షోలు, సభలకు జనం భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేపడుతున్న ర్యాలీలో వరుసగా అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా విజయ్ చేపట్టిన ర్యాలీలో మరో అపశ్రుతి జరిగింది.
విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ తిరుచిరాపల్లిలో నిర్వహించిన (TVK Chief Vijay) బహిరంగ సభ నిర్వహించింది. ఈ భారీ ర్యాలీలో జనాన్ని నియంత్రించడం నిర్వాహకులకు మరోసారి సవాలుగా మారింది. ఈ క్రమంలో టీవీకే నేత ఆధవ్ అర్జున్ కారు తగలడంతో విధుల్లో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ కాలికి తీవ్ర గాయమైంది. గతంలో కరూర్‌లో జరిగిన తొక్కిసలాట సంఘటన మరువకముందే, మళ్లీ తిరుచ్చిలోనూ జనసందోహం మధ్య సరైన నిర్వహణ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా మరో ఘటనలో బైక్‌పై నుంచి ఓ అమ్మాయి పడిపోయింది. వెంటనే నటుడు విజయ్ కాన్వాయ్ నుంచి దిగి వెళ్లి ఆమెను పరామర్శించాడు.
Read Also: రెండో కల్లు డిపోను కొనసాగించండి.. సొసైటీ ప్రతినిధుల వినతి
Follow Us On: Facebook

