రెండో కల్లు డిపోను కొనసాగించండి.. సొసైటీ ప్రతినిధుల వినతి

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) లో ఐదువందల కుటుంబాలకు జీవనాధారమైన రెండవ కల్లు డిపోను నడిపించుకునేలా అనుమతి ఇవ్వాలని సొసైటీ సభ్యులు ఎక్సైజ్ అధికారులను కోరారు. నిజామాబాద్ టి.టి.సి.ఎస్ డిపో 2 లో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకున్నామని, తమ వ్యాపారం కొనసాగించుకోడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ గురువారం నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, నిజామాబాద్ 2 కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘంకు సంబంధించిన కార్మికులుగా గత రెండున్నర దశాబ్దాలుగా సొసైటీ నడుపుకుంటూ 500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో సొసైటీలో ఎలాంటి విభేదాలు లేకుండా ఉమ్మడిగా సొసైటీ నిర్వహించుకుంటామని హామీనిచ్చారు. సొసైటీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఎక్సైజ్ అధికారులను కలిసిన వారిలో రెండో డిపో సొసైటీ ప్రతినిధులు, సభ్యులు ఉన్నారు.

Read Also: మీకు నిధులా, మాకు బాధలా? మంత్రులూ.. ఖమ్మం ఏజెన్సీకి నిధులేవి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>