కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ప్రభంజనం సృష్టించి, సీఎం పీఠాన్ని అదిరోహించిన తమిళగ వెట్రి కళగం ( TVK) అధినేత విజయ్ (TVK Chief Vijay) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. తన పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని ఆయన వ్యుహారచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన పార్టీని జాతీయ పార్టీగా విస్తరించేందుకు విజయ్ అడుగులు వేస్తున్నారని.. ఇందులో భాగంగా కర్ణాటకపై ఆయన కన్నేశారని తమిళనాడు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.
ఈ మేరకు బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడంపై విజయ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జూన్ లో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుంది. అయితే ఈ నగరంలో తమిళులు భారీగా నివసిస్తారు. . బెంగళూరు సిటీలో దాదాపు 20 నుంచి 22 లక్షల మంది వరకు తమిళులు నివసిస్తారని అంచనా. బెంగళూరు నగరంలో దాదాపు 50 డివిజనుల్లో తమిళుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పాటు బెంగళూరులో తనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం చేత తన పార్టీని అక్కడ బరిలో నింపాలని విజయ్ యోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు విజయ్ అభిమాన సంఘాలు బెంగళూరులో నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండటం కూడా పార్టీకి కలిసి వస్తుందని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటిదాకా తమిళనాడు సీఎం విజయ్ (TVK Chief Vijay) నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Read Also: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: రాహుల్ గాంధీ
Follow Us On: Instagram

