కలం, వెబ్ డెస్క్: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేసే వరకు వదిలిపెట్టబోమని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హెచ్చరించారు. నీట్ లీకేజీ ఘటనకు ఆయనే కారణమని.. బాధ్యత తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిన్న రాత్రి ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు నీట్ లీకేజీ ఘటనను నిరసిస్తూ భారీగా ఆందోళన చేపట్టారు. ఈ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ.. నీట్ పరీక్ష రద్దు కారణంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించి.. ఇక నుంచి లీకులు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసే వ్యవస్థ తేవాలని డిమాండ్ చేశారు.
కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు..
నీట్ లీకేజీ కేసులో (NEET Leak) సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేసిన సీబీఐ.. వారిని కస్టడీలోకి తీసుకోవాలని పిటిషన్ వేసింది. ఇదిలా ఉంటే, ఈ మొత్తం లీకేజీ ప్రక్రియలో ఏటా ప్రశ్నాపత్రం రూపొందించే ఇద్దరు లెక్చరర్ల పాత్ర కీలకమని సీబీఐ నిర్ధారణకు వచ్చింది.
Read Also: భారీ శుభవార్త.. జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ జీవిత బీమా’
Follow Us On : WhatsApp

