Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ అనే నేను.. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కు విన్నపం

కలం, వెబ్ డెస్క్ : టీవీకే అధిపతి విజయ్ (TVK Chief Vijay) తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఈ మేరకు లోక్ భవన్ కు వెళ్లిన విజయ్ ఇంఛార్జ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను విజయ్ కోరారు. తనకు ప్రభుత్వానికి ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం ఉందని చెప్పారు. తనకు మద్ధతిస్తున్న 112 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందజేశారు. దీంతో గురువారం విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

కాగా, 234 స్థానాల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. అయితే మ్యాజిక్ ఫిగర్ కు విజయ్ పార్టీ 10 సీట్ల దూరంలో నిలిచింది. అయితే కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీకి మద్ధతు ఇచ్చింది. తాము విజయ్ పార్టీతో కలిసి ఉంటామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు తాజాగా గవర్నర్ కలిశారు. విజయ్ భేటీకి ముందు లోక్‌భవన్‌లో గవర్నర్‌ను ఈసీ కలిసింది. ఈ మేరకు గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాల వివరాలు గవర్నర్‌కు అందజేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>