కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం పదవుల పండుగకు తెరలేపింది. ఎంతో కాలంగా పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్న కార్పొరేషన్ ఛైర్మన్ (State Corporations) పదవులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మొత్తం 17 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే వీరు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మిగిలిన నామినేటెడ్ పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
17 కార్పొరేషన్లకు ఛైర్మన్లు వీరే..
బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ – బస్వరాజు శ్రీనివాస్
మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ – బొమ్మ శ్రీరాం చక్రవర్తి
వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ – జువ్వాడి నర్సింగ్ రావు
కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ – బండి రమేశ్
కల్లు గీత కార్పొరేషన్ ఛైర్మన్ – మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్
వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ – గుంజ రేణుక
పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ – గూడూరి శ్రీనివాస్
తెలుగు అకాడమీ ఛైర్మన్ – వెంకట రమణ
వాషర్ మెన్ కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ – డాక్టర్ దాసిరాజు అజయ్ కుమార్
హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఛైర్మన్ – ప్రొ.వెంకటరమణ
వాల్మికీ బోయ కార్పొరేషన్ ఛైర్మన్ – గట్టు తిమ్మప్ప
యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ – రఘునాథ్ యాదవ్
భట్టరాజు కో–ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ – బాల్‌రాజ్
తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ – కొల్లే సరిత
తెలంగాణ పశుగణ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – చరణ్ కౌశిక్ యాదవ్
పెరిక కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ – డొంగరి వెంకటేశ్వర్లు
మేర కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ – సంగా వెంకటరాజం
కార్పొరేషన్లకు వైస్ ఛైర్మన్లు వీరే..
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు – పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్
వాషర్మన్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ – బంగారు బాబు
టాడ్డీ ట్యాపర్స్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ – కేసం నాగరాజు గౌడ్
పెరిక కో ఆపరేటివ్ కార్పొరేషన్ – బుడగం శ్రీనివాస్
మేర కో ఆపరేటివ్ కార్పొరేషన్ – ఎం. లక్ష్మీ నారాయణ
వాల్మీకి బోయ కో ఆపరేటివ్ కార్పొరేషన్ – బోయ నాగేశ్
మున్నూరు కాపు కో ఆపరేటివ్ కార్పొరేషన్ – అల్లం భాస్కర్
యాదవ కో ఆపరేటివ్ కార్పొరేషన్ – గజ్జి భాస్కర్ యాదవ్
వడ్డెర కో ఆపరేటివ్ కార్పొరేషన్ – బత్తుల వెంకటేశ్
తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – జక్కని అనీత
కమ్మ కార్పొరేషన్ – పరుచూరి మురళి

