కలం, వెబ్ డెస్క్: మల్కాజ్‌గిరి సీపీ సుమతి (CP Sumathi) తనదైన శైలిలో ఆకతాయిలకు గట్టి గుణపాఠం చెప్పారు. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ మహిళల రక్షణ కోసం ఆమె ఒక సాహసోపేతమైన స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల వరకు సాగిన ఈ ఆపరేషన్‌లో ఆమె సామాన్య మహిళలా రోడ్డుపై నిల్చున్నారు.
ఒక ఐపీఎస్ అధికారి అని తెలియని పోకిరీలు ఆమెను చుట్టుముట్టి అసభ్య పదజాలంతో వేధించారు. వస్తావా? రేటెంత? అంటూ అసహ్యంగా ప్రవర్తించిన 40 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు ఉండటం గమనార్హం. మహిళల భద్రత విషయంలో రాజీ లేదని ఈ ఆపరేషన్ ద్వారా సీపీ సుమతి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: నిజామాబాద్‌లో జోరుగా తాటి ముంజల విక్రయాలు
Follow Us On : WhatsApp

