పారా అథ్లెట్లపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

కలం, స్పోర్ట్స్ : ఆసియన్ పారా గేమ్స్ 2026లో చారిత్రక విజయాలు సాధించిన భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) గురువారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ముఖాముఖి సమావేశమయ్యారు. 114 పతకాలతో సంచలనం సృష్టించిన పారా క్రీడాకారుల(Para Athletes) అసాధారణ ప్రదర్శనను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 2010లో కేవలం 14 పతకాలకే పరిమితమైన భారత్.. ఈసారి ఏకంగా 114 పతకాలు సాధించడం అథ్లెట్ల కష్టానికి నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు. క్రీడాకారుల పట్టుదల, శిక్షకుల సహకారం, క్రీడారంగానికి ఏర్పడిన బలమైన మద్దతు వ్యవస్థే ఈ చారిత్రక ప్రగతికి ముఖ్య కారణమని తెలిపారు.

జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరిగిన ఈ క్రీడల్లో భారత జట్టు 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలతో మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో భారత అథ్లెట్లు (Para Athletes) 5 ప్రపంచ రికార్డులు, 9 ఆసియా రికార్డులు నెలకొల్పారు. అంతేకాకుండా నాలుగు ఈవెంట్లలో మూడు పతకాలను భారత అథ్లెట్లే గెలుచుకుని ఆధిపత్యం చాటారు. మహిళా అథ్లెట్లు సైతం అద్భుత ప్రదర్శన కనబరిచారు. జట్టులోని 56 మంది మహిళల్లో 34 మంది పతకాలు సాధించడం విశేషం. చివరి రోజునే భారత జట్టు 9 స్వర్ణాలు సాధించి తమ ప్రతిభను చాటుకుంది. 2023లో సాధించిన 108 పతకాల రికార్డును తిరగరాస్తూ భారత్ సాధించిన ఈ విజయం దేశంలో పారా స్పోర్ట్స్ ఎదుగుదలకు స్పష్టమైన సూచికగా నిలుస్తోంది.

Also Read : మ‌ల్లీప్లెక్స్‌లో డ్రింక్స్‌ తాగుతున్నారా.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>