ఆయుధాలను వీడకుంటే అంతుచూస్తాం : అమిత్​ షా

కలం, వెబ్​డ డెస్క్​ : ఆయుధాలను వీడని వాళ్ల అంతు చూస్తామని మావోయిస్టులను ఉద్దేశించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా (Amit Shah) హెచ్చరించారు. సోమవారం ఆయన పార్లమెంట్​ లో మావోయిస్టుల నిర్మూళనపై స్టేట్​ మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్​ పార్టీ వైఫల్యం వల్లే దేశంలో మావోయిస్టులు విపరీతంగా పెరిగారని ఆరోపించారు. ఆదివాసుల హక్కులను రక్షిస్తామని చెప్పారు. ఒకప్పుడు నక్సల్స్​ కు అడ్డాగా ఉన్న బస్తర్​ ప్రాంతం నేడు అభివృద్ధి వైపు దూసుకుపోతుందని వెల్లడించారు. మావోయిస్టులు లొంగిపోతే వారికి పునరావాసం కల్పిస్తామని షా హామినిచ్చారు. లొంగుబాటుకు రేపటితో (మంగళవారం) కేంద్ర ప్రభుత్వం డెడ్​ లైన్ ముగియనుందని గుర్తు చేశారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని అమిత్​ షా కోరారు.

Read Also: ఆహార కల్తీపై ఉక్కుపాదం.. నెల రోజుల్లో 61 కేసులు, 15 టన్నుల పదార్థాల సీజ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>