మహిళలను కోటీశ్వరులను చేస్తాం: ఎమ్మెల్యే రేవూరి

కలం, పరకాల: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి (Revuri Prakash Reddy) అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వావలంబన లక్ష్యంగా ఏర్పాటైన పరకాల ఇందిరా మహిళా డైరీకి రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం దామెర మండల కేంద్రంలోని డైరీ ప్లాంట్ వద్ద మహిళలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి చొరవతోనే డైరీకి భూమి కేటాయింపు సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో పరకాల ఇందిరా మహిళా డైరీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, దామెర మండల మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>