మోకాళ్ల‌పై కూర్చొని కాంట్రాక్ట్ కార్మికుల నిరసన

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కాంట్రాక్టు కార్మికులకు (Hospital Contract Workers) కనీస వేతనం 26 వేలకు పెంచేదాకా ఆసుపత్రి కార్మికుల ఆందోళన ఆగదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి సురేష్ అన్నారు. ఆస్పత్రి పారిశుధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ విభాగాల కాంట్రాక్టు కార్మికులకు కనీస వేట 26 వేలకు పెంచాలని కాల పరిమిత ముగిసిన ఏజెన్సీ కాంట్రాక్టర్ల టెండర్లను రద్దు చేయాలని, కార్పొరేషన్ ద్వారా కార్మికులకు జీతాలు చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకై తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆసుపత్రి కార్మికుల రెండో రోజు ఆందోళనలో భాగంగా మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ వినూత్నంగా మోకాళ్లపై కూర్చొని నిరసన చేపట్టారు. ముందుగా కాంట్రాక్టు కార్మికులు ఆసుపత్రి ప్రాంగణంలో మహిళా కార్మికుల డప్పుల దరువులతో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న పరిస్థితి కార్మికుల జీతాల పెంపు పట్ల అనుసరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉన్నదని ఆరోపించారు. ఆసుపత్రి కార్మికులకు గత ఐదు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదని వాపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో పెంచిన కనీస వేతనాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులకు వర్తింప చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు కొత్త కొత్త వార్డులు భవనాల నిర్మాణ సముదాయాలు పడకలు పెంచుతున్నారే తప్ప అందుకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచడం లేదని అన్నారు. పెరుగుతున్న ధరలతో కార్మికులకు చెల్లిస్తున్న 11,500 దేనికి సరిపోవడం లేదని వాపోయారు. కార్మికుల జీతంతో అధికారులు ప్రజా ప్రతినిధులు ఒక్క పూటైన జీవించగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కాలయాపన లేకుండా తక్షణమే మానవత దృక్పథంతో కార్మికులకు కనీస వేగం 26 వేలకు పెంచాలని ఏజెన్సీల విధానం రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కార్మికుల ఆందోళన పట్టించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యూనియన్ బ్రాంచ్ నేతలు రంగన్న,బి. చెన్నయ్య ,జే.నరసింహ, బాలకోటి,యుగంధర్ రెడ్డి,యాదయ్య, మన్యం, నైసన్, మురళి, శ్రీనివాస్ రెడ్డి, అంజలయ్య, శ్రీను, నరేష్,రామకృష్ణ, చిన్నయ్య, శ్రీశైలం, శంకర్,బాలరాజ్ ,శేఖర్, సత్తమ్మ, నాగమణి, చంద్రకళ,సువర్ణ,లక్ష్మి జ్యోతి,సునీత,మంజుల,జమున,అరుణ, కవిత నిర్మల,మమత, చెంచు లక్ష్మమ్మ,చిట్టెమ్మ,మల్లమ్మ,సంజన,అంజమ్మ,పద్మ,గాయిత్రి, సుశీల, మీనా,గీత,సుధా రుపుల్ నిషా బేగం, అంజలి,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>