కొత్త PRC, పాత పెన్షన్‌పై టీఎన్జీవోల కీలక డిమాండ్!

కలం, కరీంనగర్ బ్యూరో : నేడు స్థానిక టీఎన్జీవోల సంఘ భవనంలో (TNGO Karimnagar)  జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దారం శ్రీనివాసరెడ్డి ఉద్యోగుల సమస్యలు, హక్కులు, భవిష్యత్ కార్యాచరణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12న నిర్వహించనున్న భారీ ర్యాలీకి టీఎన్జీవో కేంద్ర సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

సీపీఎస్‌పై ప్రభుత్వం వెంటనే కమిటీని ఏర్పాటు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణకు సంబంధించి కమిటీ త్వరగా వేసీ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ కమిటీ నివేదికను త్వరగా తెప్పించుకొని, ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు, మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

అదేవిధంగా, NHS (నెట్‌వర్క్ హాస్పిటల్ సర్వీసెస్) పరిధిలో ఉద్యోగులకు అందించే వైద్య సేవల విషయంలో ఏ ఉద్యోగి కూడా ఆసుపత్రుల్లో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆసుపత్రులు ఉద్యోగుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. ఏదైనా సందర్భంలో అదనపు చార్జులు కానీ డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేసినటువంటి ఆస్పత్రుల యొక్క వివరాలు సంఘానికి తెలుపవలసిందిగా కోరారు. ఇతర ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని సమావేశంలో స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, సర్థార్ హర్మీంధర్ సింగ్ , ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంత్ రావు, నాయకులు ఇరుమల్ల శారద, రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, సునీత, సరిత, తిమ్మాపూర్ అద్యక్షులు పోలు కిషన్, చొప్పదండి అద్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి నరేష్, జమ్మికుంట కార్యదర్శి సాయి కుమార్, నాల్గవ తరగతి జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, నాయకులు కమలాకర్, హరిప్రియ, సుస్మిత విజయలక్ష్మి, కరుణాకర్ సుధాకర్ రెడ్డి, లవకుమార్, అజ్గర్ అలీ, శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>