కలం, వెబ్ డెస్క్: కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి ఫస్ట్ ఎటెంప్ట్‌లోనే విజయాన్ని సాధించి అధికారానికి వచ్చిన వారిలో దివంగత ఎంజీఆర్ మొదటి పొలిటీషియన్. ఇప్పుడు ఆ రికార్డును టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) అధిగమించారు. నలభై ఏండ్ల తర్వాత ఎంజీఆర్ (MGR) ను మించి పోయిన వ్యక్తిగా విజయ్ చరిత్రకెక్కారు. డీఎంకేలో కొనసాగిన ఎంజీఆర్ 1972లో అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీని పెట్టి ఫస్ట్ టైమ్ 1977 ఎన్నికల్లో బరిలోకి దిగారు. మొదటిసారే అధికారాన్ని చేజిక్కించుకుని ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సంవత్సరం ఎన్నికల్లో ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీకి 30.48% ఓట్ షేర్ వచ్చింది. ఇప్పుడు విజయ్ సైతం పార్టీని స్థాపించిన రెండున్నరేండ్లలోనే ఎన్నికల్లో పోటీకి దిగారు. మొదటి ప్రయత్నంలోనే ఎంజీఆర్ తరహాలో పవర్‌లోకి వస్తున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 100కు పైబడిన స్థానాల్లో ఆయన పార్టీ గెలిచింది.
చెన్నైలో డీఎంకేకు రాజకీయ సమాధి :
చెన్నై నగరం డీఎంకే పార్టీకి మొదటి నుంచీ కంచుకోట. కానీ యాక్టర్ విజయ్ (TVK Chief Vijay) ఆ చరిత్రను తిరగరాశారు. ఆ పార్టీకి దాదాపుగా రాజకీయ సమాధి కట్టారు. చెన్నై నగరంలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2021 ఎన్నికల్లో ఒక్కటి మినహా మిగిలిన 15 స్థానాలూ డీఎంకే వశమయ్యాయి. కానీ ఇప్పుడు ఉదయనిధి పోటీ చేసిన చేపాక్, సీనియర్ డీఎంకే నేత శేఖర్‌బాబు పోటీచేస్తున్న హార్బర్ నియోజకవర్గాలు మినహా మిగిలినవన్నీ విజయ్ పార్టీ వశమయ్యాయి. డీఎంకే, అన్నాడీఎంకేలను తుడిచిపెట్టి టీవీకే విజయం సాధించింది. చివరకు స్టాలిన్ పోటీ చేసిన కొళత్తూరు నియోజకవర్గాన్ని సైతం టీవీకే వశపర్చుకున్నది. విజయ్ తొలిసారి పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తిరుచ్చిలో సైతం ఆయన గెలుపొందారు. ఈ రెండింటిలో ఏది వదులుకుంటారో త్వరలో డిసైడ్ కానున్నది.
ఆ సీటు త్రిషకేనా?.. తోడు.. నీడగా..
పొలిటికల్ పార్టీ పెట్టి పోటీ చేసిన తొలిసారే రెండు స్థానాల్లో గెలుపొందిన విజయ్ దేన్ని వదులుకుంటారన్నది కీలకంగా మారింది. రాజీనామా చేసిన స్థానాన్ని త్రిషకు (Trisha) కేటాయిస్తారా?.. తోడు నీడగా ఉంటున్న ఆమెను తన సహచర ఎమ్మెల్యేగా చూసుకోవాలనుకుంటున్నారా?.. పరిపాలనలోనూ తనకు తోడుగా ఉంచుకోవాలని ఆశపడుతున్నారా?.. ఇలాంటి అనేక ప్రశ్నలు, చర్చలు తమిళనాట వినిపిస్తున్నాయి. “నాకు సీఎం కావాలన్న ఆశ ఉన్నది.. నిజంగా చెప్తున్నా.. పదేండ్లలో నేను సీఎం అవుతాను.. మీరే చూడండి..” అని చాలాకాలం క్రితం మీడియాతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు సీఎం అవుతారో.. లేదో.. కానీ విజయ్‌తో పాటే పొలిటికల్‌గానూ త్రిష నడుస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. సినీ పరిశ్రమలో, నిజ జీవితంలో తోడుగా ఉన్నట్లే ఇప్పుడు పాలిటిక్స్‌లోనూ ఆయన వెంటే ఆమె…!
Read Also: టీవీకే చీఫ్ విజయ్‌కు రాహుల్ గాంధీ ఫోన్
Follow Us On : WhatsApp

