కలం, వెబ్ డెస్క్: తమిళనాడుకు కాబోయే కొత్త సీఎం, టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫోన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు విజయ్‌ను రాహుల్ గాంధీ అభినందించగా.. ధన్యవాదాలు తెలిపారు. మేజిక్ ఫిగర్ 118 సీట్లకు దగ్గరగా రావడంతో.. ఉత్కంఠ పెరుగుతోంది. విజయ్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా.. లేదా కాంగ్రెస్ పార్టీ సాయం తీసుకోబోతున్నారా.. అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
రేపు ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం..
టీవీకే చీఫ్ విజయ్ రేపు మామల్లపురం రిసార్ట్‌లో పలువురు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే గెలిచినవారికి విజయ్ కార్యాలయం నుంచి సందేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
Read Also: ఐపీఎల్ టీం హోటల్ రూల్స్‌పై బీసీసీఐ కొత్త కోడ్ ఆఫ్ కండక్ట్
Follow Us On: Instagram

