కలం వెబ్ డెస్క్: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఊహించని రిజల్ట్స్ వచ్చాయి. అధికార పార్టీలకు ఓటర్లు భారీ షాకిచ్చారు. బెంగాల్, తమిళనాడు, కేరళలో భారీ ఎత్తున అధికార పార్టీ నేతలు ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో గెలుపొందిన వారికి దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమిళనాడు (Tamil Nadu) ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ (TRS) పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) స్పందించారు.
ఈ మేరకు ఆమె (Kavitha) ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నేతలతో విసిగిపోయామని కవిత అన్నారు. అధికార దాహార్తులతో వేసారిపోయామని, భ్రష్టుపట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగరాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని అభిప్రాయపడ్డారు. దీనిపై దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపించారని కవిత తన పోస్టులో పేర్కొన్నారు. కవిత కూడా కొత్త పార్టీ పెట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Read Also: తమిళనాడులో బీజేపీకి భారీ షాక్!
Follow Us On: Sharechat

