కలం, వెబ్ డెస్క్: టీవీకే అధినేత విజయ్ (TVK Vijay) నేటి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. మొదటి రోజు విజయ్ పోటీ చేయనున్న పెరంబూరు (Perambur) నుంచే ప్రచారం ప్రారంభించనున్నారు. నేడు చెన్నైలో మొత్తం ఐదు చోట్ల విజయ్ ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయ్ పెరంబూరుతో పాటు తిరుచ్చి ఈస్ట్ నుంచి కూడా పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టీవీకే పార్టీ తమిళనాడులోని మొత్తం 234 స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని 30 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టింది. పెరంబూర్‌లో విజయ్‌కు పోటీగా డీఎంకే నుండి ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్డీ శేఖర్ పోటీలో ఉండగా, తిరుచ్చి ఈస్ట్‌లో ఇనిగో ఇరుదయరాజ్ బరిలో ఉన్నారు.

