కలం, వెబ్ డెస్క్: ఏపీలోని విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా ఎల్వీ నగర్‌లో దారుణ ఘటన జరిగింది. నేవీ టెక్నీషియన్ రవీంద్ర (35) తన ప్రియురాలిని ఘోరంగా చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అయితే ఈ మధ్య కాలంలోనే అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో ప్రియురాలు మౌనిక (Mounika) (29) ను ఆదివారం రాత్రి ఫ్లాట్‌కు రప్పించాడు. ఈ క్రమంలోనే వారి మధ్య గొడవ తలెత్తి తీవ్రంగా మారింది. కోపంతో రగిలిపోయిన రవీంద్ర.. మౌనికను దారుణంగా చంపాడు. ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై ఒక్కసారిగా ఖంగుతున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మౌనిక తల మిస్ అయినట్లు గుర్తించారు. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

