Mobile Popup Ad
Mobile Popup Ad

నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై ఉద్యమించాలి: టీయూసీఐ

కలం, నిజామాబాద్ బ్యూరో: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద మే డే జెండా ఆవిష్కరించారు. టీయూసీఐ ఆలిండియా ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వనమాల కృష్ణ (Vanamala Krishna), టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. 1886 లో చికాగో నగరంలో 8 గంటల పని దినాల అమలు కోసం, పనికి తగ్గ వేతనం కోసం, పెట్టుబడిదారుల శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాడిన రోజే మే డే అని అన్నారు. ఆనాడు కార్మిక నాయకుల త్యాగం, వారి పోరాట ఫలితమే నేడు ప్రపంచ వ్యాప్తంగా 8 గంటల పని దినం అమలవుతుందన్నారు.

కార్మిక వర్గం సాధించుకున్న కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నదన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. పశ్చిమాసియా దేశాలలోని ఆయిల్ సంపదపై కన్నేసిన అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇజ్రాయిల్ తో జతకట్టి ఇరాన్ పై యుద్ధం చేస్తుందన్నారు. ఈ యుద్ధ ప్రభావం వల్ల దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి పేద, మధ్యతరగతి ప్రజలపై, ముఖ్యంగా కార్మికవర్గంపై భారాలు పెరిగాయన్నారు. మేడే పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధనకై, యుద్ధాలకు వ్యతిరేకంగా పెరుగుతున్న శ్రమదోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ (TUCI) జిల్లా జిల్లా నాయకులు రాజేశ్వర్, కిరణ్, రవి, లింగం, గోవర్ధన్ శివకుమార్ యాదమ్మ సుజాత లక్ష్మి శైలజ, రాధ, శాంతి కుమార్, విజయ్ కుమార్ లక్ష్మీకాంత్, తిరుపతి, సాయి, నర్సింగరావు, వినోద్, అశోక్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఇది మోదీ సర్కార్ గిఫ్ట్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>