కలం, వెబ్ డెస్క్ : మే డే సందర్భంగా కేంద్రం ఇవాళ కమర్షియల్ సిలిండర్ ధర ను ఏకంగా రూ.993 పెంచడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. మే డే సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. హోటల్ కార్మికులకు మే డేన మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇది అని ఎద్దేవా చేశారు. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ల ధరలను మోదీ సర్కార్ పెంచేసిందని ఆరోపించారు.
మోదీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర సుమారు రూ. 3,315 కు చేరిందని కేటీఆర్ వెల్లడించారు. హోటల్ కార్మికుల నడ్డి విరిచేలా కేంద్ర నిర్ణయం ఉందని ధ్వజమెత్తారు. దీని ప్రభావం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని చెప్పారు. గతంలో ప్రధాని మోదీ ‘పకోడీలు వేసుకోవడం కూడా ఒక ఉద్యోగమే’ అని అన్నారని.. ఇప్పుడు గ్యాస్ ధరల పెంపు వల్ల పకోడీలు కూడా వేసుకోలేని పరిస్థితి ఉందని వెల్లడించారు. అయినా ఎన్నికల తర్వాత ధరలు పెంచడం మోదీ సర్కార్ కు అలవాటేనని వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో మరిన్ని ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
Read Also: షారుఖ్ ఖాన్ ఆటపై మురళీ కార్తీక్ అసంతృప్తి
Follow Us On: X(Twitter)

