కలం, వెబ్ డెస్క్ : ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మాడు పగిలే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆయా జిల్లాల్లో కుండపోత వర్షం (Heavy Rain) పడుతోంది. నిన్న మొన్నటి వరకు భానుడి భగభగలతో తీవ్ర అవస్థలు పడిన అక్కడి ప్రజలు చల్ల బడ్డ వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఎండల తీవ్రతతో కురుస్తున్న అకాల వర్షం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పంటలు కోత దశలో ఉండగా అకాల వర్షాలు రావడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణీ ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాసేపట్లో విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామారాజు, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Also: ఇది మోదీ సర్కార్ గిఫ్ట్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

