Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ రోజు అన్నదాన సత్రం క్లోజ్

కలం, డెస్క్ : తిరుమలకు (TTD) వెళ్లే భక్తులకు అలర్ట్ న్యూస్ ఇది. మార్చి 3వ తేదీన టీటీడీ అన్నదాన సత్రం వితరణ కేంద్రం మూసి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ రోజు చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి, తిరుచానూరులో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన సత్రాలు అన్నీ మూసి ఉంటాయి. టీటీడీ (TTD) పరిపాలన బిల్డింగ్ లో ఉండే ఉద్యోగుల క్యాంటీన్, విష్ణు నివాసం వసతి సముదాయాల్లోని అన్నదాన సత్రం, తోళ్లప్ప గార్డెన్స్ లోని ఎస్వీ నిత్య అన్నప్రసాదన భవనం, శ్రీనివాసం అన్నదాన వితరణ కేంద్రాలు ఆ రోజు తాత్కాళికంగా మూసి ఉంటాయని.. 4వ తేదీ నుంచి యథావిధిగా తెరుచుకుంటాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>