సూసైడ్ నోట్ రాసి.. భవనంపై నుంచి దూకిన ఇంటర్ అమ్మాయి

కలం, వెబ్ డెస్క్: నారాయణపేట జిల్లా మద్దూర్ కేజీబీవీ (KGBV) కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (Inter Student Suicide Attempt) చేసింది. రెండంతస్తుల భవనంపై నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని దూకింది. ఒక అబ్బాయితో మాట్లాడిందంటూ టీచర్ మందలించడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని.. ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో సూసైడ్ నోట్ రాసి భవనంపై నుంచి సూసైడ్ అటెంప్ట్ చేసింది.

సదరు విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కళాశాలలో సీసీ కెమెరాలు లేకపోవడంతో అబ్బాయి ఎవరన్నది తెలియలేదని సిబ్బంది చెప్పుకొచ్చారు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>