Mobile Popup Ad
Mobile Popup Ad

రాజ్‌కోట్‌లో 1,489 ఇండ్లు నేలమట్టం.. రూ. 350 కోట్ల విలువైన భూమి స్వాధీనం

కలం, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని రాజ్‌కోట్ (Rajkot) నగరంలో మున్సిపల్ అధికారులు రెండు రోజుల పాటు చేపట్టిన మెగా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 1,489 అక్రమ కట్టడాలను కూల్చివేశారు. జంగ్లేశ్వర్ ప్రాంతంలోని రోడ్డుతో‌పాటు అజీ నది ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ నిర్వహించారు. దీనివల్ల సుమారు రూ.350 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి తిరిగి లభించిందని మున్సిపల్ కమిషనర్ తుషార్ సుమేరా వెల్లడించారు.

ఈ కూల్చివేతల్లో కేవలం పూరి గుడిసెలే కాకుండా, దాదాపు 200కు పైగా విలాసవంతమైన బంగ్లాలు కూడా ఉండటం గమనార్హం. వీటిలో ఏసీ సౌకర్యాలు కలిగిన భవనాలు రూ. 15 నుండి 20 లక్షల విలువ చేసే పక్కా గృహాలు ఉన్నాయి. సుమారు 1,500 మంది సిబ్బంది, 260కి పైగా జేసీబీలు, ట్రాక్టర్లతో అత్యంత భారీ స్థాయిలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ముఖ్యంగా అజీ నది తీరంలో ఉన్న ఇళ్లు వర్షాకాలంలో వరదలకు గురవుతూ ప్రాణనష్టానికి కారణమవుతున్నాయని అధికారులు తెలిపారు. గతంలో ఇక్కడి వారిని రక్షించే క్రమంలో సహాయక సిబ్బంది సైతం ప్రమాదాల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ కూల్చివేతల (Demolished) వల్ల భవిష్యత్తులో వరద ముప్పు తప్పుతుందని, అలాగే మెరుగైన రోడ్ల నిర్మాణం వల్ల అంబులెన్స్, ఫైర్ ఇంజన్లు వంటి అత్యవసర సేవలు సులభంగా అందుతాయని కమిషనర్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>