ఏపీని చంద్రబాబు సిండికేట్ పాలిస్తోంది: వైఎస్ జగన్

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఆక్వా రంగం సమస్యల సుడిగుండంలో ఉందని మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని చంద్రబాబు సిండికేట్ పాలిస్తోందని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సభలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి జగన్ నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఆక్వా రైతులు దీనావస్థలో ఉన్నారని.. ఇష్టానుసారం ఫీడ్ ధరలు చెంచుకుంటూ పోతున్నారని ఫైర్ అయ్యారు. ఆక్వా రంగం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు. ఏకపక్షంగా ధరలు పెంచొద్దని అనేకసార్లు చెప్పామని.. అయినా దున్నపోతు మీద వర్షం పడినట్లుగా కూటమి ప్రభుత్వం తీరు ఉందని దుయ్యబట్టారు.

రేట్లు తగ్గితే తగ్గించరా?

ధరల పెరుగుదలకు హేతుబద్దత ఉండాలని.. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని మండిపడ్డారు. ఫీడ్, సీడ్ రేట్లు చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తారని ఆరోపించారు. చంద్రబాబు సిండికేట్ చేతుల్లో రైతులు నగిలిపోతున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్లకు పండగే పండగ అని.. ఇక రైతలన్నకు కన్నీరే మిగులుతుందని విమర్శించారు. ఫీడ్ రేట్లు కేజీకి రూ.14 నుంచి 16లకు ఎడాపెడా పెంచేశారని.. ముష్టి వేసినట్టు కేజీకి రూ.2 తగ్గిస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. రేట్లు పెంచితే పెంచేస్తారు.. రేట్లు తగ్గితే తగ్గించరా? అని మండిపడ్డారు.

అప్పడాకు పూర్వ వైభవం తెస్తాం..

చంద్రబాబు తీరు వంద కొరడా దెబ్బలు కాదు.. 98 దెబ్బలే అన్నట్టుగా ఉందని జగన్ దుయ్యబట్టారు. తమ హయాంలో ఆక్వా రైతుల కోసం అప్సడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. సీడ్, ఫీడ్, మార్కెటింగ్ లో సమస్యలు వస్తే పరిష్కరించామన్నారు. చంద్రబాబు వచ్చాక అప్పడాను నిర్వీర్యం చేశారని విమర్శించారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకున్నామని చెప్పారు. రైతుకు గిట్టుబాటు ధర తగ్గకూడదని చట్టం చేశామని అన్నారు. ఈరోజు కేజీ కౌంట్ రూ.230లు దాటని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. అప్పడాకు పూర్వ వైభవం తెస్తామని.. రైతుల కోసం ఉద్యమబాట పడుతామన్నారు.

ఫిషరీస్ వర్సిటీని నిలిపివేశారు..

రాష్ట్రంలో ఆక్వా రైతులకు తమ ప్రభుత్వ హాయాంలో 1.50కే యూనిట్ విద్యుత్ కల్పించామని అన్నారు. ఐదేళ్లలో సబ్సిడీ కింద రూ. 3306 కోట్లు చెల్లించామని చెప్పారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.401 కోట్ల సబ్సిడీ బకాయిలు చెల్లించామన్నారు. 35 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు పెట్టామని గుర్తు చేశారు. ఆర్బికేల పరిధిలో ఫిషరీష్ అసిస్టెంట్లను నియమించామన్నారు. నరసాపురంలో తాము తెచ్చిన ఫిషరీస్ వర్సిటీని నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో మెడికల్ కాలేజీ పనులు కూడా నిలిపివేశారని అన్నారు. మూడేళ్ల తర్వాత రైతు ప్రభుత్వం వస్తుందని.. చంద్రబాబు సిండికేట్ ను కూకటివేళ్లతో పీకేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>