కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ(supervisor trainee) పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు, 114 మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులున్నాయి. ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు డిగ్రీ అర్హత కాగా, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుకు ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 30 డిసెంబర్ 2025 నుండి 20 జనవరి 2026 వరకు tslprb.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ,ఎస్టీలకు రూ.400గా నిర్ణయించారు. దరఖాస్తుకు ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, ఇతర నియమనిబంధనలను సవివరంగా పరిశీలించాలి.
Read Also: సీఎం రేవంత్ ఢిల్లీ టూర్, రెండు రోజులు అక్కడే మకాం
Follow Us On: Youtube


