కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 27, 28 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానంతో క్యాబినేట్ విస్తరణ, కేసీఆర్ ప్రెస్‌మీట్, జ్పడీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల గురించి చర్చించే అవకాశాలున్నాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ ప్రధాని నరేంద్రమోదీతోనూ (PM Modi) భేటీ అయ్యే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్ అంశాలు, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ప్రత్యేకంగా చర్చించవచ్చునని తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 28 ఢిల్లీ (Delhi) పర్యటన తర్వాత ఆ మరుసటి రోజు జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ పాల్గొంటారు.
Read Also: ఢిల్లీలో ప్రధాని మోడీ క్రిస్మస్ ప్రార్థనలు
Follow Us On: X(Twitter)


