epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

దుమ్ముదులిపిన దేవదత్ పడిక్కల్.. కర్ణాటక పేరిట మరో రికార్డ్

కలం స్పోర్ట్స్: దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal).. విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ టీమ్ ని దుమ్ముదులిపేశాడు. టోర్నీ తొలిరోజే ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 118 బంతుల్లో 147 పరగుల భారీ స్కార్ చేసి జార్ఖండ్ ఇచ్చిన 413 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో దేవత్ కీలకంగా నిలిచాడు. లిస్ట్–A క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యంత పెద్ద విజయవంతమైన స్కోర్ ఛేజ్‌గా నిలిచింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కర్ణాటకకు ఆరంభ వికెట్‌ను విద్యాధర్ పాటిల్ అందించాడు. అనంతరం విరాట్ సింగ్, కుమార్ కుశాగ్ర అర్ధశతకాలు జార్ఖండ్ ఇన్నింగ్స్‌కు పునాది వేశాయి. కానీ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ అసలైన ఆకర్షణగా మారింది. కిషన్ కేవలం 39 బంతుల్లో 125 పరుగులు నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. 50 ఓవర్లలో జార్ఖండ్ 412/9 పరుగులతో భారీ స్కోరు నమోదు చేసింది.

అయితే ఆ లక్ష్యం కర్ణాటకను నిలువరించలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (54) , దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) (147) కలిసి 114 పరుగుల భాగస్వామ్యంతో బలమైన ఆరంభం ఇచ్చారు. ఆర్సీబీ బ్యాటర్ పడిక్కల్ 118 బంతుల్లో 147 పరుగులు (10 ఫోర్లు, 7 సిక్సర్లు)తో ఇన్నింగ్స్‌ను అలంకరించాడు. చివర్లో అభినవ మనోహర్, ధ్రువ్ ప్రభాకర్ సజావుగా ఆడి కర్ణాటకకు విజయాన్నిఅందించారు.

లిస్ట్–A క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు:

దక్షిణాఫ్రికా – 435 vs ఆస్ట్రేలియా, జోహానెస్‌బర్గ్ (2006)

కర్ణాటక – 413 vs జార్ఖండ్, అహ్మదాబాద్ (2025)

క్విన్స్‌లాండ్ – 399 vs టాస్మానియా, నార్త్ సిడ్నీ (2014)

కరాచీ – 392 vs సియాల్కోట్, సియాల్కోట్ (2004)

మిడిలెసెక్స్ – 388 vs డర్హామ్, చెస్టర్-లీ-స్ట్రీట్ (2025)

Read Also: ఇంగ్లండ్ కోచ్‌గా రవిశాస్త్రి?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>