రాప్తాడు ఘటనపై హెచ్ఎం కుమారుడు క్లారిటీ!

కలం, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ స్కూల్‌లో విద్యార్థినిపై దాడి (Rapthadu School Attack)  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో స్కూల్ హెచ్ఎం రాజేశ్వరిని విద్యా శాఖ సస్పెండ్ చేసినట్లుగా వస్తున్న వార్తలను ఆమె కుమారుడు రాహుల్ కార్తికేయ ఖండించారు. కుటుంబ తగాదాల కారణంగానే విద్యార్థినిపై దాడి జరిగిందని డీఈవో నివేదికలో రాశారని తెలిపారు. ఘటన జరిగిన అనంతరం మూడు గంటల పాటు తాను కూడా స్కూల్‌లోనే ఉన్నతాధికారులతో ఉన్నానని.. మా అమ్మకు ఎలాంటి సస్పెన్షన్ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

పాఠశాలలో నిర్మాణాలు జరుగుతున్నాయని.. అందరూ అతడిని అక్కడ పనిచేస్తున్న వ్యక్తి కావొచ్చని భావించినట్లు రాహుల్ వివరించారు. ఘటన (Rapthadu School Attack) జరిగిన అనంతరం తన తల్లి బాలికతో పాటే అంబులెన్స్‌లో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి కూడా వెళ్లారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలికను మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే బాధితురాలి తల్లితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితుడు హేమంత్‌గా గుర్తించిన పోలీసులు.. ధర్మవరం రైల్వే స్టేషన్ వద్ద అదుపులో తీసుకున్నారు.

Also Read : ఏపీ ఎలక్షన్​ స్టాఫ్​కు సర్కార్​ శుభవార్త!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>