విద్యను వ్యాపారంగా మార్చొద్దు.. ఆల్ఫోర్స్‌పై బీఎస్ఎఫ్ ఆగ్రహం

కలం, కరీంనగర్‌ : ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (Alfores International School) పేరుతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా కరికులంను (పాఠ్య ప్రణాళిక) అమలు చేసేందుకు కొత్తగా కరీంనగర్‌లో ప్రారంభించనున్న పాఠశాల కోసం సదరు విద్యాసంస్థల యాజమాన్యం తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు చేసిన దరఖాస్తులను తిరస్కరించి, అనుమతులను నిలిపివేయాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (BSF) రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేష్ డిమాండ్ చేశారు.

ఇప్పటికే ఆల్ఫోర్స్ విద్యాసంస్థల యాజమాన్యం విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయికి విస్తరించి, విచ్చలవిడిగా రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచ్ లను స్థాపించి, విద్యను వ్యాపారంగా మలిచిందన్నారు. ఇంటర్నేషనల్ పేరుతో మరో పాఠశాలను స్థాపించి లక్షల రూపాయల ఫీజుల వసూలుకు శ్రీకారం చుట్టిందన్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా కరికులంను ఈ ప్రాంత విద్యార్థులకు అలవరచి, విదేశీ సంస్కృతికి శాశ్వత బానిసలను చేసే ప్రయత్నం చేస్తుందన్నారు.

ప్రభుత్వాన్ని, రాజకీయాలను అడ్డుపెట్టుకొని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల యాజమాన్యం తమ విద్యాసంస్థలను సమాజంలో కొరకరాని కొయ్యగా తయారు చేసిందన్నారు. ప్రభుత్వం అల్ఫోర్స్ విద్యాసంస్థల యజమానికి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కట్టబెడితే, విద్యావ్యాపారంతో పాటు సూడా కార్యాలయం అవినీతి మాయంగా మారుతుందన్నారు. ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అనుమతులను నిలిపివేసి విద్యారంగాన్ని పరిరక్షించాలని, లేనిపక్షంలో తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>