Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్‌కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన చర్చలు సైతం ఫెయిల్ అయ్యాయి. ఇరాన్ అణ్వాయుధ తయారీని ఆపేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వలేదని.. అందుకే చర్చలు సక్సెస్ కాలేదని అమెరికా ప్రతినిధి స్పష్టం చేసింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) సంచలన ట్వీట్ చేశారు. ఇరాన్‌తో తాము తుది యుద్ధానికి సిద్ధమంటూ ఆయన వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేయాలంటూ తన నౌకాదళాలను ఆదేశిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.

‘ఇరాన్ హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తెరుస్తామని హామీ ఇచ్చింది. కానీ వారు ఆ హామీని నిలబెట్టుకోలేదు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ప్రజలు ఆందోళన, ఇబ్బందులు, నష్టాలు ఎదుర్కొన్నారు. వారు సముద్రంలో మైన్లు పెట్టామని చెబుతున్నారు. అయితే వారి నౌకాదళం పూర్తిగా ధ్వంసమైందని మేము భావిస్తున్నాం. మైన్లు వేయగల సామర్థ్యం కూడా వారికి లేదు’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రతిష్ఠకు తీవ్ర నష్టం జరిగిందని ట్రంప్ అన్నారు. వారి నాయకత్వం కూడా గౌరవం కోల్పోయిందన్నారు. అయితే, ఇప్పుడు వాటి గురించి మాట్లాడే దశ దాటిపోయిందని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం, ఈ అంతర్జాతీయ జల మార్గాన్ని వెంటనే తెరవాలని కోరారు. ‘ఇరాన్‌తో సమావేశం 20 గంటలు. అనేక అంశాలపై చర్చలు జరిగాయి. కానీ ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని (nuclear ambitions) వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కొన్ని విషయాల్లో ఒప్పందాలు కుదిరినా, అవి పెద్దగా ప్రాధాన్యం కలిగివుండవు, ఎందుకంటే ఇలాంటి అస్థిరమైన, అంచనా వేయలేని నాయకత్వం చేతుల్లో అణు శక్తి ఉండటం ప్రమాదకరం.’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>