Mobile Popup Ad
Mobile Popup Ad

బెట్టింగ్‌, జూదం ఆడేవారిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బెట్టింగ్‌, జూదం ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా (Harish Kumar Gupta) హెచ్చరించారు. ఆన్‌లైన్‌ గేమింగ్ పేరుతో జరిగే బెట్టింగ్, జూదం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బెట్టింగ్ కు పాల్పడితే.. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల బెట్టింగ్‌పై (IPL crackdown) జీరో టాలరెన్స్‌తో వ్యవహరించాలని ఎస్పీలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ నెట్‌వర్క్‌లపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారని.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా ఉన్న పలు క్లబ్‌లు మూసివేసినట్లు వివరించారు. బెట్టింగ్ ద్వారా సంపాదించే ఆస్తులను చట్టప్రకారం అటాచ్ చేస్తామని తెలిపారు. ఐపీఎల్ సందర్భంగా లాడ్జీలు, హోటళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై నిరంతర సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లను గుర్తించామని.. సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బుకీలు, ఏజెంట్లు, బెట్టింగ్‌లో పాల్గొనే వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>