epaper
Monday, November 17, 2025
epaper

ముగిసిన షట్ డౌన్.. ఆ ఫైలుపై ట్రంప్ సంతకం

US Shutdown | అమెరికా చరిత్రలో అత్యంత దీర్ఘకాలం కొనసాగిన ఆర్థిక షట్‌డౌన్‌ ఎట్టకేలకు ముగిసింది. బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) సంబంధిత ఫండింగ్ ఫైలు మీద సంతకం చేశారు. ఈ బిల్లును అంతకుముందు ప్రతినిధుల సభ 222-209 తేడాతో ఆమోదించింది. ఈ షట్‌డౌన్‌తో అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లింది. దాదాపు 43 రోజుల పాటు కొనసాగింది. అమెరికా ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలను ఆపివేయడం వల్ల సార్వత్రికంగా ఉద్యోగులు సెలవులోకి వెళ్లారు. పలు ఫెడరల్ సర్వీసులు నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవహారాలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. గతంలో 21 రోజులు షట్ డౌన్ కొనసాగగా.. ఈ సారి రికార్డు స్థాయిలో 43 రోజులుగా కొనసాగించింది. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పేద ప్రజలు, చిన్న వ్యాపారాలపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. ఇంతకాలం తర్వాత బిల్లుకు అధ్యక్షుడు సంతకం చేయడంతో, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఫెడరల్ సర్వీసులు మొదలయ్యాయి.

షట్‌డౌన్ అంటే ఏమిటి?

అమెరికా ఫెడరల్ ప్రభుత్వం నడిపే సేవలు, కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోవడాన్ని ‘షట్‌డౌన్’ అంటారు. కాంగ్రెస్ ఆమోదించాల్సిన బడ్జెట్ బిల్లులు సమయానికి ఆమోదం పొందకపోతే జరుగుతుంది.అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1 నుంచి మొదలవుతుంది. ఈ తేదీ నాటికి కొత్త బడ్జెట్ బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేయకపోతే, ప్రభుత్వ ఖర్చులకు చట్టబద్ధమైన అనుమతి లేకుండా పోతుంది. ఫలితంగా ‘నిధుల కొరత’ వల్ల ప్రభుత్వ శాఖలు పని ఆపేస్తాయి. షట్‌డౌన్‌(Shutdown) ఫలితంగా ‘అత్యవసర సేవలు’ మాత్రమే కొనసాగుతాయి. జాతీయ భద్రత, వైమానిక రంగ నియంత్రణ, ఆస్పత్రులు, పోస్టల్ సర్వీస్ లాంటివే కొనసాగుతాయి. జాతీయ ఉద్యానవనాలు, మ్యూజియంలు, పాస్‌పోర్ట్ కార్యాలయాలు, పర్యావరణ పరిశోధనలు మొదలైనవి నిలిచిపోతాయి. లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు తాత్కాలిక సెలవుపై వెళతారు.

ఇటీవల షట్‌డౌన్ రావడానికి కారణం

సెప్టెంబర్ 30 నాటికి బడ్జెట్ ఆమోదం పొందకపోవడంతో అక్టోబర్ 1 నుంచి షట్‌డౌన్ ప్రారంభమైంది. ఇది అమెరికా చరిత్రలో అతి సుదీర్ఘమైన షట్‌డౌన్(US Shutdown) కావడం గమనార్హం. రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీల మధ్య గొడవల వల్ల ఈ షట్ డౌన్ వచ్చింది. రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తీర్మానాలు ప్రతిపాదించింది. కానీ, సెనేట్‌లో డెమోక్రాట్లు 14 సార్లు తిరస్కరించారు. డెమోక్రాట్లు అఫర్డబుల్ కేర్ యాక్ట్ క్రింద ఉన్న ఆరోగ్య బీమా సబ్సిడీలు (ప్రీమియం ట్యాక్స్ క్రెడిట్లు)ను ఒక సంవత్సరం పొడిగించాలని డిమాండ్ చేశారు. ఇవి 2025 చివరి నుంచి ముగిసిపోతాయి. రిపబ్లికన్లు దీన్ని అంగీకరించలేదు ఇటువంటి కారణాలతో షట్ డౌన్ పరిస్థితి ఏర్పడింది.

Read Also: ఎట్టకేలకు ఆ నిజం అంగీకరించిన ట్రంప్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>