‘మీ చావు మీరు చావండి’.. ట్రంప్ సీరియస్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) నాటో మిత్ర దేశాలపై సీరియస్ అయ్యారు. యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ తమకు సహకరించడం లేదని మండిపడ్డారు. గగనతలంలో ఆయా దేశాలు అమెరికా యుద్ధ విమానాలను అనుమతి ఇవ్వడం లేదని.. అలాంటి దేశాలకు తాము సహకరించబోమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు బ్రిటన్, ఫ్యాన్స్, స్పెయిన్ దేశాలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఇరాన్ తో యుద్దంలో నాటో (NATO) మిత్ర దేశాలు తమకు సహకరించడం లేదని ఆరోపించారు. అలాంటి దేశాలకు తాను రెండు ఆప్షన్లు ఇస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. హార్ముజ్ జలసంధి రవాణా నిలిచిపోయిన కారణంగా జెట్ ఇంధనం పొందలేకపోతున్న యునైటెడ్ కింగ్డమ్‌లాంటి దేశాలు అమెరికా నుంచి చమురు కొనాలని, తమ దగ్గర చాలానే చమురు నిల్వలు ఉన్నాయని తెలిపారు. రెండవది.. కొంత ఆలస్యమైన ధైర్యాన్ని కూడగట్టుకుని, ఆ జలసంధికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. పరోక్షంగా తమకు సహకరించని దేశాలకు తమ సహాయం ఉండదని.. వాటి చావు వాటిదేనని ట్రంప్ తేల్చి చెప్పారు.

ఇజ్రాయెల్, అమెరికా దళాలు సంయుక్త దళాలు దాడులు చేస్తున్న వేళ హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం చమురు రవాణా ఈ జలసంధి గుండానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభం ఏర్పడింది. నాటో మిత్ర దేశాలు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలకు సరఫరా చేసేందుకు తమ వద్ద ఆయిల్ ఉన్నా.. ఆయా దేశాలు తమకు మద్దతు ఇవ్వడం లేదని ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆయా దేశాలకు రెండు ఆప్షన్లు ఇస్తూ ట్రంప్ (Trump) తాజా హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: కవిత క్షమాపణలన్నీ ఓట్ల కోసమేనా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>