కలం, వెబ్ డెస్క్ : ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్భంధించడంతో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్ అణు ఒప్పందం చేసుకునే వరకు హర్మూజ్ జలసంధి దిగ్భంధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ముడి చమురు ధరలు (Oil Prices) మళ్లీ భగ్గుమన్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 6 శాతం పెరిగి 120 డాలర్లు దాటింది. 2022 తర్వాత ఇంతగా పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దిగ్భంధనాన్ని ఎత్తివేస్తేనే హర్మూజ్ ను తెరుస్తామని ఇరాన్ అంటోంది. ఈ ప్రతిపాదనను ట్రంప్ ఒప్పుకోవడం లేదు. అతి త్వరలో శత్రు బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తాం అని హెచ్చరిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే చమురు సరఫరా (Oil Prices) క్లిష్టతరమై ప్రపంచ దేశాల్లో వాటి ధరలకు రెక్కలు రావొచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ఇది మోదీ సర్కార్ గిఫ్ట్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Instagram

