కలం, వెబ్డెస్క్: సోషల్ మీడియా యుగంలో సరిహద్దులు దాటుతున్న ప్రేమాయణాలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో అవతలి వ్యక్తి చూపిస్తోంది నిజమైన ప్రేమా? (True Love) లేక నటన? అని తెలుసుకోవడం ఇప్పుడు అనివార్యంగా మారింది. ఈ సందిగ్ధత నుంచి బయటపడేందుకు రిలేషన్ షిప్ నిపుణులు కొన్ని కీలక సూత్రాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా ముక్కు మొహం తెలియని వ్యక్తులతో ప్రేమలో పడి మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం మాటలను నమ్మకుండా, ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఆధారంగా వారి ప్రేమను అంచనా వేయవచ్చని వారు సూచిస్తున్నారు.
నిజమైన ప్రేమ (True Love)ను గుర్తించే లక్షణాలు:
ప్రత్యేక శ్రద్ధ: నలుగురిలో ఉన్నప్పుడు కూడా మీకు ప్రత్యేక గౌరవం ఇస్తూ, మీపై అధిక శ్రద్ధ చూపిస్తుంటే అది నిజమైన ప్రేమకు సంకేతం.
అభిప్రాయాలకు విలువ: ముఖ్యమైన విషయాల్లో మీ సలహాలు తీసుకోవడం, మీరు మాట్లాడేటప్పుడు ఆసక్తిగా వినడం వారి ఇష్టాన్ని తెలియజేస్తుంది.
సౌకర్యం, నమ్మకం: మీకు ఇబ్బంది కలిగించే అంశాలను వారు చర్చించరు. అలాగే, మీరు ఇతరులతో మాట్లాడినా అనుమానించకుండా మీపై పూర్తి నమ్మకాన్ని కలిగి ఉంటారు.
సమయం గడపడం: ఖాళీ దొరికితే చాలు మీతోనే ఉండాలని కోరుకోవడం, అలాగే తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు మిమ్మల్ని పరిచయం చేయడానికి ఉత్సాహం చూపుతారు.
భవిష్యత్ ప్రణాళిక: కేవలం వర్తమానం గురించి కాకుండా, మీ భవిష్యత్ లక్ష్యాలను ప్రోత్సహిస్తూ వారి జీవితంలో మీకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పిస్తారు.
కష్టాల్లో తోడు: మీ సంతోషంలోనే కాదు, ఆర్థికంగా లేదా మానసికంగా మీరు కృంగిపోయినప్పుడు కూడా అండగా నిలుస్తారు.
గుడ్డిగా నొమ్మొద్దు..
అయితే, పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినంత మాత్రాన అందరినీ గుడ్డిగా నమ్మేయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొంతమంది ప్రారంభంలో మంచిగా నటించి, ఆ తర్వాత తమ అసలు రంగు బయటపెట్టే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. అందుకే అవతలి వ్యక్తి గురించి పూర్తిస్థాయిలో ఆరా తీయాలని, లోతుగా చర్చించాలని వారు సూచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామనే బలమైన భరోసా కలిగినప్పుడు మాత్రమే, ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని రిలేషన్ షిప్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: సొరకాయతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ..
Follow Us On: Instagram

