కలం, వెబ్ డెస్క్: క్రికెట్ ప్రేమికులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ (IPL) 2026 సమరానికి ఇంకొన్ని రోజులే సమయం ఉంది. సిక్సర్ల మోత, బౌండ్రీల వరద, వికెట్ల సునామీలకు మైదానాలు సన్నద్ధం అవుతున్నాయి. అభిమానులను అలరించడానికి, తమ సత్తాచాటడానికి ప్లేయర్లు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ టోర్నీ శ్రీలంక ప్లేయర్ల పార్టిసిపేషన్‌పై కీలక అప్‌డేట్ వచ్చేసింది. లంక పేసర్ ఈషాన్ మలింగ (Eshan Malinga)కు శ్రీలంక క్రికెట్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది.
అయితే స్టార్ ప్లేయర్లు మతీష పతిరానా (Matheesha Pathirana), వానిందు హసరంగ (Wanindu Hasaranga)ల రాకపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం శ్రీలంక బోర్డు తాజాగా ఆటగాళ్లకు అనుమతులు మంజూరు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈషాన్ మలింగ (Eshan Malinga) మంగళవారం (మార్చి 24) నాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ క్యాంప్‌లో చేరనున్నారు. ఇప్పటికే అనుమతి పొందిన కమిందు మెండిస్‌తో కలిసి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. వీరితో పాటు దుష్మంత చమీర, పథుమ్ నిస్సంక, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ దసున్ షనకలకు కూడా బోర్డు ఎన్‌ఓసీ (NOC) జారీ చేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన మతీష పతిరానా, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ వానిందు హసరంగలు సోమవారం జరిగిన ఫిట్‌నెస్ టెస్టులకు హాజరు కాలేకపోయారు. దీనివల్ల వారి రాక ఆలస్యం కానుంది. పతిరానా సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కావచ్చని, అయినప్పటికీ కోల్‌కతా ఫ్రాంచైజీ ఆయన కోలుకునే వరకు వేచి చూడాలని నిర్ణయించుకుంది. మరోవైపు నువాన్ తుషారా ఎన్‌ఓసీ విషయం ఆయన ఫిజికల్ టెస్ట్ ఫలితాలపై ఆధారపడి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మంగళవారం బెంగళూరు చేరుకుంటారని ఫ్రాంచైజీ వర్గాలు ధృవీకరించాయి. మార్చి 28న ఎం. చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న తొలి మ్యాచ్ కోసం జట్టు సిద్ధమవుతోంది. అలాగే, మార్చి 25న ముంబైలో జరిగే కెప్టెన్ల సమావేశానికి తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ హాజరుకానున్నారు.
Read Also: సొరకాయతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ..
Follow Us On: X(Twitter)

