కలం, మెదక్: ఎండాకాలం వస్తుందంటే చాలు.. ఎక్కడో ఒక చోట ఎలక్ట్రిక్ బైక్‌లకు సంబంధించి అగ్నిప్రమాదాలు జరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలు ఎలక్ట్రిక్ వాహనాల భద్రతా ప్రమాణాలపై సందేహాలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా మెదక్ (Medak) జిల్లా తూప్రాన్(Toopran) పట్టణంలో సోమవారం అర్థరాత్రి ఒక ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. తూప్రాన్‌కు చెందిన చంద్రశేఖర్ రెడ్డి తన ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జింగ్ పెట్టి తీసివేశారు. అయితే అర్థరాత్రి తర్వాత బైక్‌లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి.
స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, మంటలు అదుపులోకి రాలేదు. దీంతో బైక్ పూర్తిగా దగ్ధమై బూడిదైంది. ఈ ఘటనలో భవనంలోని డ్రైనేజీ పైపులు, విద్యుత్ వైర్లు కూడా కాలిపోయాయి. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: రాబోయే కొద్ది రోజుల్లో భూధార్ కార్డులు అందజేస్తాం: పొంగులేటి
Follow Us On: Instagram

