తెలంగాణకు పొదుపు సూత్రాలు.. APకి నిధులు : మోదీపై కవిత ఫైర్‌ !

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ పట్ల ప్రధాని మోదీ (PM Modi) అనుసరిస్తున్న వైఖరిని తెలంగాణ రాష్ట్ర సేన అధినేత్రి కవిత (Kavitha) తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని పర్యటనలో తెలంగాణకు కేవలం పొదుపు సూత్రాలు మాత్రమే చెప్పారని, అదే సమయంలో పక్క రాష్ట్రం ఆంధ్రాకు మాత్రం భారీగా నిధులు కేటాయించారని ఆమె విమర్శించారు. మహిళా బిల్లు వంటి కీలక అంశంపై ప్రధాని మౌనం వహించడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు.

దేశంలో త్వరలో ప్రారంభం కానున్న జనగణనపై కవిత (Kavitha) కీలక డిమాండ్లను లేవనెత్తారు. ఇప్పటికే ఇళ్ల గణన ప్రక్రియ పూర్తయిందని, తదుపరి జరిగే జనగణన ఫారమ్‌లలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ కేటాయించాలని ఆమె కోరారు. కేవలం కుల గణన మాత్రమే కాకుండా, ఉపకులాలు అలాగే ప్రజల సామాజిక స్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read Also: సిట్ విచారణకు బండి భగీరథ్ డుమ్మా.. అదే కారణమా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>