కలం, కరీంనగర్ బ్యూరో: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను (Adluri Laxman) కరీంనగర్‌లో బుధవారం నూతన మార్కెట్ కమిటీ (Karimnagar Market Committee Chairman) చైర్మన్ ఆకుల నరసయ్య (Akula Narsaiah) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూల మొక్కను అందించి శాలువాతో సత్కరించారు. ఆకుల నరసయ్యకు మంత్రి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు అత్యుత్తమ సేవలు అందించాలని సూచించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు అందేలా కృషి చేయాలన్నారు. కరీంనగర్ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తన వంతు చేస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ పరిధిలో ధాన్యం కొనుగోలు వేగవంతం అయ్యేలా చూడాలని మంత్రి సూచించారు.
Read Also: సిట్ విచారణకు బండి భగీరథ్ డుమ్మా.. అదే కారణమా!
Follow Us On : WhatsApp

