Mobile Popup Ad
Mobile Popup Ad

మాది లీడర్ బేస్డ్ పార్టీ కాదు.. కేడర్ బేస్డ్ పార్టీ : కవిత

కలం, వెబ్‌డెస్క్: తమది లీడర్ బేస్డ్ పార్టీ కాదు.. కేడర్ బేస్డ్ పార్టీ అని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) అన్నారు. నిరంతరం ప్రజలతో టచ్‌లో ఉండి వారి సమస్యలను పరిష్కారించాలని అనుకుంటున్నామని తెలిపారు. లీడర్ అనే వారిని ప్రజలే తయారు చేస్తారన్న ఆమె.. అదే లీడర్‌ను ఇంటింటికి పరిచయం చేసే కేడర్‌కు ప్రస్తుతం విలువలేదు అని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని కేడర్ ఎవ్వరూ ప్రస్తుతం సంతృప్తిగా లేరని ఆమె ఆరోపించారు.

తాము ప్రతీ బూత్‌లో కార్యకర్తను తయారుచేస్తామని ఆమె (TRS Chief Kavitha) స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చే కేడర్‌కు అత్యంత విలువనిచ్చే పార్టీగా తెలంగాణ రక్షణ సేన ఉంటుందని స్పష్టం చేశారు. కేడర్ల కృషితో సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా గ్రౌండ్ లోకి వెళ్తామని వెల్లడించారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రివల్యూషన్ లో భాగంగా తాము ఇప్పుడు సరైన మలుపులో ఉన్నామన్న కవిత.. తాము చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: తెలంగాణ టెంపుల్ టూరిజం : మన గుడులు.. మన సంస్కృతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>