మాతృవియోగంతో బాధపడుతున్న ఆనంద్‌కు ఎమ్మెల్యే ఏలేటి భరోసా!

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) పట్టణంలోని గొల్లపేట్ కాలనీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు శ్యామకూర ఆనంద్ మాతృమూర్తి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) గొల్లపేటలోని ఆనంద్ నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మాతృవియోగంతో బాధపడుతున్న ఆనంద్‌కు ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఇందులో కౌన్సిలర్ వినిషా లక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు అయిండ్ల భూపాల్‌ రెడ్డి, సత్యం చంద్రకాంత్, జుట్టు దినేష్, ఇర్ల విజయ్, కొరిపెల్లి శ్రవణ్‌ రెడ్డి, డాక్టర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>