Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు : టీఆర్ఎస్ చీఫ్ కవిత

కలం, వెబ్ డెస్క్ : బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని.. తెలంగాణకు ఆ పార్టీ బద్ద వ్యతిరేకి అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) అన్నారు. శనివారం మీట్ ది ప్రెస్ లో ఆమె టీఆర్ఎస్ పాంచజన్యంలోని అంశాలను వివరించారు. ఈ సందర్భంగా తన పార్టీపై వచ్చిన విమర్శలపై కవిత స్పందించారు. ఉన్న పార్టీకి దిక్కులేదు.. కొత్త పార్టీ వచ్చి ఏం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ తన గురించి జోకులు వేసినా, తన పార్టీని విమర్శించినా పట్టించుకోనని కాలమే సమాధానం చెబుతుందని వెల్లడించారు. పార్టీ ఉండడమే ఒక పవర్ అని.. అది పవర్ లోకి వస్తుందో.. ప్రతిపక్షంలో ఉంటుందో తర్వాత సంగతి బీజేపీకి తెలంగాణలో ప్లేస్ లేదని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో రాష్ట్రానికి ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. ఆయన కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెప్పించలేకపోయారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలూరుకు వచ్చిన సందర్భంలో ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు మళ్లీ రాష్ట్రానికి మోదీ వస్తున్నారని ప్రాజెక్టుకు జాతీయ హోదాపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధులు, జాతీయ హోదా తీసుకురావాలని ప్రధాని మోదీ పై తెలంగాణ బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకురావాలని కవిత (TRS Chief Kavitha) కోరారు. అలాగే, మహిళా రిజర్వేషన్ల విషయంలో దేశ మహిళలు ఆయనను క్షమించరన్నారు. రాష్ట్రానికి పన్నుల రూపంలో 1.80 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది.

Read Also: తెలంగాణ టెంపుల్ టూరిజం : మన గుడులు.. మన సంస్కృతి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>