Mobile Popup Ad
Mobile Popup Ad

కేరళలో కాంగ్రెస్ కూటమి ఘన విజయం.. కేసీ వేణుగోపాల్‌ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: కేరళ (Kerala)లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ఇప్పటికే 101 స్థానాల్లో గెలుపొంది.. ఒక స్థానంలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇక ఎల్డీఫ్ 33 స్థానాల్లోనే గెలుపొంది.. 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కేరళలో కాంగ్రెస్ కూటమి గెలుపు పట్ల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో కేరళ ప్రజల ముందు కార్యాచరణ ఉంచుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకులు తెలుసుకుంటారని.. తమ మిత్రపక్షాలతోనూ సంప్రదింపులు జరుపుతామని అన్నారు. వామపక్షాల దుస్థితికి వారే పూర్తిగా బాధ్యులు అని విమర్శించారు.

కేరళ (Kerala) ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించడంతో హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులు బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, చంద్రాయణగుట్ట ఇన్ చార్జ్ నగేష్, మహిళా నాయకురాలు సంధ్య రెడ్డి, తదితర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: ఎంజీఆర్ రికార్డును అధిగమించిన విజయ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>