కలం, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ అధినేత్రి కవిత (TRS Chief Kavitha) పార్టీ ఆవిర్భావం అనంతరం తొలి ప్రసంగంలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని కీలక హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినా రాష్ట్రంలో నిరుద్యోగం ఎందుకు ఉన్నదని ప్రశ్నించారు. ఉస్మానియా వర్సిటీలో పీజీలు చేసిన విద్యార్థులు గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అయినా నిరుద్యోగులకు ఒకటే తరహా హామీ ఇస్తోందని.. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని మాత్రమే ఎందుకు చెబుతున్నదని ప్రశ్నించారు. విద్యార్థులకు కొన్ని కలలు ఉంటాయని.. ఆ కలలను తాము నెరవేరుస్తామని కవిత పేర్కొన్నారు.
నిరుద్యోగుల కలలు నిజం చేస్తాం
తాము నిరుద్యోగుల కలలు నిజం చేస్తామని కవిత (TRS Chief Kavitha) హామీ ఇచ్చారు. 2 లక్షల నుంచి కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థులు వ్యాపారాలు చేసుకోవడానికి, ఇతర రంగాల్లో రాణించేందుకు తాము అవకాశాలు కల్పిస్తామన్నారు. కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగులకు న్యాయం జరగలేదని కవిత విమర్శించారు.

