గుజరాత్ మోడల్‌ను తీసుకోవాలి: కవిత

కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ అభివృద్ధి కోసం తప్పకుండా గుజరాత్ మోడల్‌ను అవలంబించాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ చీఫ్ కవిత (TRS Chief Kavitha) అన్నారు. గుజరాత్‌లో బీసీ-ఈ క్యాటగిరీ కింద ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారని, కానీ ఇక్కడ మాత్రం అటువంటిది అమలు కావడం లేదని అన్నారు కవిత. ఆ ఒక్క విషయంలో మాత్రం గుజరాత్‌ను స్ఫూర్తిగా తీసుకోవచ్చని కవిత వివరించారు. ‘‘ఇక్కడ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం.. అధికారంలోకి రావడానికి ముందు వరకు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పారు. కానీ బీజేపీతో వీళ్లకి ఉన్న స్నేహమో ఏది కారణమో తెలీదు కానీ ఇప్పటి వరకు రాలేదు’’ అని గుర్తించారు కవిత.

దాంతో పాటుగా క్యాబినెట్‌లో మైనర్‌ నేతకు స్థానం కూడా దక్కలేదని, తాము ప్రశ్నిస్తే ఇప్పుడు అజారుద్దీన్‌కు (Azharuddin) మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీ చేశారని చెప్పారు కవిత. దాంతో పాటుగా పెళ్ళి సందర్భంగా ముస్లిం యువతులకు చెప్పిన షాదీముబారక్ కింద అందిస్తామన్న బంగారం అందలేదు, ఉపాధి అందలేదు, పిల్లలకు చెప్పిన స్కూటీ కూడా అందించలేదీ ప్రభుత్వం అని గుర్తించారు. ముస్లింలకు చెప్పిన ఏ హామీని కూడా ఈ ప్రభుత్వం అందించలేదని, కానీ తమ ప్రభుత్వం అలా చేయదని కవిత (TRS Chief Kavitha) అన్నారు.

Read Also: తెలంగాణ టెంపుల్ టూరిజం : మన గుడులు.. మన సంస్కృతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>