మందు బాబులకు భారీ షాక్: పెరగనున్న మద్యం ధరలు?

కలం, వెబ్‌ డెస్క్‌ : తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అదనపు ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్రంలో లిక్కర్ ధరల (TG Liquor Price)ను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెలలోనే కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై 60 రూపాయల వరకు పెరుగుదల ఉండవచ్చు.

ప్రీమియం బ్రాండ్ల విషయానికి వస్తే ఫుల్ బాటిల్‌పై 100 రూపాయల వరకు పెంచాలని యోచిస్తున్నారు. ఇక అంతకంటే ఖరీదైన ఉన్నత శ్రేణి బ్రాండ్లపై ఏకంగా 120 రూపాయల మేర భారం పడే అవకాశం ఉంది. ఈ ధరల పెరుగుదల ద్వారా ప్రతి నెలా ప్రభుత్వానికి సుమారు 250 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ దీనిపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Read Also: హగర్టీ ఊర మాస్ విక్టరీ.. యోజాపై ఘనవిజయం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>