కొత్త పార్టీ పేరుపై బిగ్ ట్విస్ట్.. కవిత క్లారిటీ..!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సేనతో స్థాపించిన పార్టీ పేరు ‘తెలంగాణ రక్షణ సేన’ గా మార్పు చెందడంపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు కొత్త పార్టీ స్థాపన తర్వాత మీడియాతో జరిగిన తొలి అధికారిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తొలుత ముహూర్తం చూసుకుని పార్టీని పేరును ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే తమకు ఎన్నికల సంఘం ఇచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన అని స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘం దగ్గర పార్టీ రిజిస్ట్రేషన్ దగ్గర అనేక కుట్రలు జరిగాయని తెలిపారు. అయితే టీఆర్ఎస్ అనేది తనకే రాసి ఉందని ఆమె చెప్పారు. నిజానికి తెలంగాణ ప్రజా జాగృతి అప్లికేషన్ ను మూడో ఆప్షన్ గా తెలంగాణ రక్షణ సేన పేరు ను ఇచ్చామని వివరించారు. అయితే దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానంతో తన పార్టీకి టీఆర్ఎస్ పేరును ఎన్నికల సంఘం ఇచ్చిందని పేర్కొన్నారు.

Read Also: తెలంగాణ టెంపుల్ టూరిజం : మన గుడులు.. మన సంస్కృతి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>