కలం, వరంగర్ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా కురవి (Kuravi) మండలం తిర్లాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గీతాంజలి స్కూలుకు చెందిన ఆటో (School Auto) అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.
డ్రైవర్ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వీరిలో నలుగురు విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యార్థులందరినీ నీటి నుంచి సురక్షితంగా బయటకు తీసి, గాయపడిన విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

