క్లాస్‌రూమ్‌లో కిరాతకం: ఇటుక, ఫ్లవర్ పాట్‌తో చిన్నారిపై దాడి!

కలం, వెబ్ డెస్క్ : హర్యానా రాష్ట్రంలోని పంచకులాలో అత్యంత కలచివేసే ఘటన (Panchkula school attack) వెలుగు చూసింది. సెక్టార్-20 పరిధిలోని సంస్కృతి మోడల్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న బాలుడు, ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై అకారణంగా దాడికి పాల్పడ్డాడు. పాఠశాలలోని తరగతి గదిలో జరిగిన ఈ కిరాతక ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

బాలుడు చిన్నారి తలపై ఇటుక, రాళ్లు అలాగే ఫ్లవర్ పాట్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన చిన్నారి స్పృహ కోల్పోయింది. అంతేకాకుండా, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా బాలికను ఈడ్చుకెళ్లి దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారిని తక్షణ చికిత్స నిమిత్తం చండీగఢ్‌లోని పిజిఐ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు అత్యవసర వైద్య చికిత్సనందిస్తున్నారు.

ఈ దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాఠశాల భద్రతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తరగతి గదిలో ఉపాధ్యాయులు ఎందుకు లేరని, పిల్లల మధ్య పర్యవేక్షణ లోపం ఎందుకు జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాఠశాల నిర్వహణ వైఫల్యంపై తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ అసలు ఏం జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>